in

Mouni Roy Harassed by ‘Older Men’ at Haryana Event

ర్యానాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వృద్ధులు తనను వేధించారని నటి మౌని రాయ్ శనివారం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన నోట్‌ను పంచుకున్నారు. ఈ సంఘటన తనను అవమానానికి, బాధకు గురిచేసిందని చెప్పారు. “నాగిని” సీరియల్‌తో పాటు, “గోల్డ్”, “మేడ్ ఇన్ చైనా” వంటి చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన మౌని రాయ్, ఇన్‌స్టాగ్రామ్ లో ఈ సంఘటన గురించి వివరించారు. తాను హర్యానాలోని కర్నాల్‌లో ప్రదర్శన ఇస్తున్నానని..

తనతో ఫోటోలు దిగే నెపంతో తనను తాకడానికి ప్రయత్నించిన కొంతమంది వృద్ధ పురుషుల ప్రవర్తన తనకు “అసహ్యం” కలిగించిందని చెప్పారు. అలా చేయవద్దని అడిగినప్పుడు..వారు తన నడుముపై చేతులు పెట్టారని, అది తనకు నచ్చలేదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తాతామామల వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు. కార్యక్రమం ప్రారంభమై నేను వేదిక వైపు నడుస్తున్నప్పుడు.. నా నడుముపై చేతులు ఉంచి ఫోటోలు తీసుకున్నారు.. ‘సార్ దయచేసి మీ చేయి తీసివేయండి’ అని నేను చెప్పినప్పుడు.. వారు వినలేదు’ అని ఆమె చెప్పింది..!!

rashmika: i will agree for item songs only for 2 directors

raashi khanna to replace meenkashi chaudhary for hindi remake!