శ్రీలీల కేవలం రెమ్యూనరేషన్ చూసి సినిమాలకు సంతకాలు చేస్తున్నారనే వాదన కూడా వినపడుతుంది. సరైన కథ ఎంపిక చేసుకోలేకపోతున్నారని అయితే శ్రీ లీల కెరియర్ ఇలా కావడానికి కారణం ఆమె తల్లి స్వర్ణలత అనే సమాచారం కూడా వినపడుతోంది..శ్రీలీల ఒక సినిమాకు కమిట్ అవ్వాలి అంటే తన ప్రమేయం లేదని మొత్తం తన తల్లి అన్ని వ్యవహారాలను చూసుకుంటుందని తెలుస్తోంది. కథ గురించి పక్కన పెడితే రెమ్యూనరేషన్ ఫిక్స్ అయితే శ్రీ లీలకు ఇష్టం లేకపోయినా ఆమె తల్లి ఆ సినిమాలకు తనని ఒప్పిస్తుందని తెలుస్తోంది..
అదేవిధంగా సినిమా షూటింగ్లకు వెళ్లిన శ్రీ లీల వెంట తన తల్లి ఉన్న నేపథ్యంలో శ్రీ లీల కంటే కూడా ఈమె డిమాండ్స్ అధికంగా ఉన్నాయని పలువురు నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలా తన తల్లి కారణంగానే శ్రీ లీల సినిమా షూటింగ్ లొకేషన్లో కూడా ఫ్రీగా ఉండలేకపోతున్నారని ఈమె కారణంగానే సరైన కథలు ఎంపిక చేసుకోలేక వరుస ప్లాప్ సినిమాలను మూటగట్టుకుంటూ కెరియర్ ను ఇబ్బందులలో పడేస్తున్నారని తెలుస్తోంది..!!