in

mollywood sensation Anaswara Rajan Makes Telugu Debut!

నశ్వర రాజన్..మలయాళంలో అక్కడి యూత్ లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. అనశ్వరలో ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందుకు సహజమైన ఆమె అభినయం కూడా తోడవడం..సక్సెస్ లు వచ్చిపడటంతో  బిజీగా మారిపోయింది. మలయాళంలో వచ్చిన ‘నెరు’..’రేఖాచిత్రం’ వంటి చిత్రాలు ఆమె నటనకి అద్దం పడతాయి. మోహన్ లాల్ వంటి గొప్ప నటుడితో ప్రశంసలు అందుకోవడం అనశ్వర ప్రతిభకు నిదర్శనం అనే చెప్పాలి..

మలయాళంలో ఇప్పుడు అనశ్వరకి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి సినిమాలను లైన్లో పెడుతూనే, ఆమె తెలుగు ..తమిళ..హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉండటం విశేషం. తెలుగులో ఆమె చేసిన ‘ఛాంపియన్’ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లకు రానుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ జోడీగా ఆమె పరిచయమవుతూ ఉండటం విశేషం. ఈ సినిమా హిట్ అయితే అనశ్వర ఇక్కడ మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. ఓటీటీ సినిమాల ద్వారా అనశ్వర అభిమానులుగా మారిపోయిన ఇక్కడి కుర్రాళ్లంతా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు..!!

akhanda 2!

Jr NTR takes legal step to defend his personality rights!