in

Mohanlal, Vijay Deverakonda to team up as father and son?

ఏడాది లైగర్ తో బాక్సాఫీస్ ముందుకు వవ్ఛిన విజయ్.. ఈ మూవీ కూడా చేధు అనుభవాన్నే మిగిల్చింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఆరాట పడినప్పటికి విజయ్ ఆశలు ఏమాత్రం ఫలించలేదు. అయినప్పటికి ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత గౌతమ్ తిన్ననూరి, పరశురామ్ వంటి దర్శకులు లైన్లో ఉన్నారు. ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. విజయ్ తాజాగా ఒక మలయాళ మూవీకి కమిట్ అయ్యాడట.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ త్వరలో ” వృషభ ” అనే భారీ పీరియాడిక్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు మలయాళ ఫిల్మ్ సర్కిల్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మోహన్ లాల్ కొడుకుగా ఓ కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండతో సంప్రదింపులు జరుగుతున్నారట. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందట. మరి ఈ ప్రాజెక్ట్ కు విజయ్ ఒకే చెబుతారా ? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే..!!

why krishna dropped his desire movie ‘Chatrapathi Shivaji’ biopic?

thamanna’s counter, introduces herself as ‘businessman husband’!