సలార్ పార్ట్ 1 లో స్టార్ కాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ లో మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. కోలీవుడ్ నుంచి బాబీ సింహ, శ్రేయా రెడ్డి, శృతిహాసన్ లాంటి వారున్నారు. ఇప్పడు మోహన్ లాల్ కూడా సలార్ 2 లో నటిస్తున్నట్లు టాక్. సలార్ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పార్ట్ 2 ఎపుడు వస్తుంది అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రభాస్ కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఇవి కంప్లీట్ అయ్యాక సలార్ 2 ఉండొచ్చని సమాచారం..మొదటి పార్ట్ కి మించి సెకండ్ పార్ట్ ఉంటుందని కొత్తగా కొందర్ని యాడ్ చేసే ఉద్దేశ్యంతోనే మోహన్ లాల్ ని ప్రశాంత్ నీల్ సంప్రదించినట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో చాలా విషయాలు సస్పెన్స్ గా ఉంచారు. అవి పార్ట్ 2 లో రివీల్ చేస్తారని ఆసక్తిగా ఉన్నారు ఫాన్స్. సలార్ 2 కి సంబంధించిన వర్క్ మొదలైంది..!!