నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘దసరా’ సినిమా సూపర్ హిట్ అయింది. నాని కెరీర్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోంది. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాకు’ది ప్యారడైజ్’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందట. దీంతో విలన్ పాత్రకు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబును సంప్రదించగా…ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మోహన్ బాబు, నాని కాంబినేషన్లో వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని భావిస్తున్నారు..!!