ఇక హీరోగా నిలబడాలనుకుంటున్నప్పుడు విఫలమవుతుండగా ఎప్పుడైనా బాధపడ్డారా? అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు మోహన్‌బాబు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే రివర్స్ లో మోహన్ బాబు బాలయ్యని అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు అన్నింటికంటే సంచలనమవుతుంది. ఒకరకంగా చంద్రబాబు అంటే పడని నికార్సైన అసలు సిసలు నందమూరి అభిమానుల మదిలో ఉన్న ఈ ప్రశ్నని ఏమాత్రం భయపడకుండా మోహన్ బాబు అడిగేశాడు. అన్న గారు.. మీ తండ్రి నందమూరి తారకరామా రావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు..
ఆయన తదనాంతరం మీచేతిలో పెట్టుకోకుండా.. చంద్రబాబుకి ఎందుకిచ్చావ్ అంటూ బాలయ్య కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా అడిగేశాడు మోహన్ బాబు. దానికి కౌంటర్ గా బాలయ్య మాట్లాడుతూ.. మరి అన్నగారి పార్టీని వదిలేసి మరో పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యావ్ అంటూ మోహన్ బాబుని అడుగగా.. ఫిట్టింగ్ పెడుతుంటాడు ఒకాయన అంటూ మోహన్ బాబు పరోక్షంగా చంద్రబాబుని అన్నట్టు ప్రోమోలో కనపడుతుంది. ఏదేమైనా బాలయ్య స్థాయిలో, స్టైల్లో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ఫస్ట్ ఇంటర్వ్యూ ఉండటంతో ఈ షోపై అంచనాలు భారిస్థాయికి చేరాయి. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రసారం కానుంది.