మోహన్ బాబు తన కెరీర్‌ను విలన్‌గా ప్రారంభించారు. విలనిజానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ఆయనకి దక్కుతుంది. చాలా కాలం తర్వాత, ఆయన మళ్లీ విలన్ అవతారంలోకి వచ్చారు. నాని నటిస్తున్న పారడైజ్ సినిమాలో శికంజ మాలిక్ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. రెండు పోస్టర్లు విడుదల చేయగా, ఆ లుక్స్ మోహన్ బాబును కొత్తగా చూపిస్తున్నాయి.
అన్ని రకాల హావభావాలను అద్భుతంగా పలికించే మోహన్ బాబు కోసం దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా ప్రత్యేకంగా ఒక పాత్రను తీర్చిదిద్దారు. ఇటీవల మోహన్ బాబు సినిమాలు చేయడం లేదు, ఆయనకి తగిన కథలు, పాత్రలు రావడం లేదు. కానీ శ్రీకాంత్ చెప్పిన ఈ క్యారెక్టర్ ఆయనకు నచ్చడంతో, మళ్లీ తెరపైకి రావడానికి ముందుకు వచ్చారు..!!