in

mistake and downfall of actress rambha!

న అందంతో, నటనతో విపరీతమైన ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ రంభ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంభ చేసిన తప్పు వల్ల ఆమె కెరియర్ మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది..2003 వ సంవత్సరంలో రంభ సినీ గ్రాఫ్ మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయింది..చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు..అవకాశాల ఊసే లేదు..దాంతో ఏం చేయాలో తెలియక మళ్లీ ఎలాగైనా ఫామ్ లోకి రావాలని ఆశపడ్డ రంభ తనే ఓ చిత్రాన్ని స్వయంగా నిర్మించి అందులో నటించాలని ఆలోచించిందట. అందులో భాగంగానే తమిళంలో త్రీ రోజెస్ అనే ఓ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇక ఈ చిత్రంలో రంభతో పాటు జ్యోతిక మరియు లైలా ప్రధాన పాత్రలను పోషించగా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కింది.

ఈ చిత్రం ను నిర్మించడానికి తను ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్ళునే అమ్మవలసి వచ్చింది. అయితే త్రీ రేజెస్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో భారీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఆ ఒక్క తప్పు చేయకుంటే రంభ లైఫ్ వేరేలా ఉండేది. ఇక అప్పుల బాధ తట్టుకోలేక ఒత్తిడి భరించలేక తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ని కూడా అమ్మేసింది. అయినప్పటికీ రంభకు ఇంకా అప్పులు తీరలేదు. దాంతో అడపాదడపా వచ్చే అవకాశాలతో సర్దుకుంటూ పలు చిత్రాలు ఐటెం సాంగ్స్ కూడా చేసి అప్పు తీర్చింది. అలా ఇన్నేళ్లు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి సంపాదించుకున్న ఆస్తి అంతా ఒక్క సినిమాతో పోగొట్టుకుంది. ఇక కెరీయర్ పూర్తిగా డౌన్ ఐన సమయంలో 2010 సంవత్సరంలో చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ను పెళ్లాడింది. ఆ తర్వాత నటనకు పూర్తిగా బై బై గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది రంభ తనకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు..!!

jn ntr reveals why he choose ‘war 2’!

Anasuya Bharadwaj Shocking Comments On Her Dressing style!