
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఒకటి… అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.. మహేష్ బాబు మొదటిసారి ఆర్మీ లుక్ లో కనిపించడం, ఇక సినిమాకి ముందు దేవీ శ్రీ అందించిన పాటలకి ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని మైండ్ బ్లాంక్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఈ పాటలో మహేష్ బాబు రష్మికల డాన్స్ ప్రేక్షకులనువిశేషంగా ఆకట్టుకుంది.

