in

Meenakshi feels blessed to have regular Sankranti releases!

మీనాక్షి చౌదరి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘అనగనగా ఒక రాజు’ సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. నవీన్ పోలిశెట్టి జోడీగా ఆమె నటించిన సినిమా ఇది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి, ఈ ఏడాది మరో సినిమాతో రంగంలోకి దిగుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆమె బీజీగా ఉన్నారు..

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో గోదావరి జిల్లాలలో సంక్రాంతి ఎలా జరుగుతుందనేది నాకు అర్థమైంది. అలాగే ఈ ప్రాంతంలో సినిమాల పట్ల ఎంత క్రేజ్ ఉంటుందనేది కూడా నేను గమనించాను. కొన్ని రకాల స్వీట్స్ కి గోదావరి  జిల్లాలు స్పెషల్ అని అర్థమైంది. ప్రతి సంక్రాంతికి నా సినిమా వస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘అనగనగా ఒక రాజు’ హిట్ అవుతుందనే నమ్మకం బలంగా ఉంది” అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..!!

Vote for your favorite performances of these beautiful actresses!

happy birthday SAROJA DEVI!