సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడు..ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఆమెకు వెయ్యుకోట్ల ప్రాజెక్టులో పవర్ఫుల్ క్యారెక్టర్ లో అవకాశం వచ్చిందని టాక్. స్త్రీ 2, మీమీ, చావా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రొడ్యూసర్..మడాక్ ఫిలిమ్స్ అధినేత..దినేష్ విజన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నాడు.
యూత్ ఫుల్ ఎంటర్టైలర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మీనాక్షి హిరోయిన్‌గా మెరువనుందట. ఇక హీరో, ఇతర కాస్టింగ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా నిజంగానే ఈ ప్రాజెక్టు మీనాక్షి చౌదరి క్లిక్ అయితే మాత్రం అమ్మడి దశ తిరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ హీరోలు సైతం మన నిర్మాతలు, డైరెక్టర్‌ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రమంలో..టాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మలు మాత్రం బాలీవుడ్ కి వెళ్లడం తెలివి తక్కువ చర్య అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.