in

Meenakshi Chaudhary Reveals the Qualities She Wants in Husband!

సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన హీరోగా ప్రభాస్ పేరు చెప్పింది మీనాక్షి. అతనిలో ఉన్న సింప్లిసిటీ, మంచి మనసు, హైట్ తనకు చాలా ఇష్టమని చెప్పింది. అందుకే ప్రభాస్‌లాంటి వ్యక్తి భర్తగా ఉంటే బాగుంటుందని చెప్పి అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో అయితే మరింత ఫన్నీగా స్పందించింది..

తన కాబోయే భర్తకి వంద ఎకరాల పొలం ఉండాలి, ఇంటి పనులు చేయాలి, వంట వచ్చి ఉండాలి, బట్టలు ఉతకాలి అని చెప్పి నవ్వులు పూయించింది. అంతేకాదు రోజుకు మూడు గిఫ్ట్స్ ఇవ్వాలి అంటూ సరదాగా చెప్పడంతో అక్కడున్నవాళ్లు ఖుషీ అయ్యారు. దీనిపై హీరో నవీన్ పోలిశెట్టి “ఇలా ఉంటే ఏఐలోనే అబ్బాయిని తయారుచేయాలి” అని జోక్ చేయడం వైరల్ అయింది. మొత్తానికి మీనాక్షి చౌదరి తన స్పష్టమైన మాటలు, క్యూట్ నేచర్‌తో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంది. సినిమాలతో పాటు వ్యక్తిత్వంతోనూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటూ ముందుకెళ్తోంది..!!

eesha rebba insulted by a director for being black!