in

Meenakshi Chaudhary refutes stress, depression rumours!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి..మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఫంక్షన్‌లో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో మీనాక్షి చాలా సహజంగా..ఫుల్‌గా భోజనం చేస్తూ కనిపించింది. అదే సమయంలో ఆమె చెప్పిన మాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

జీవితంలో నాకు స్ట్రెస్ అవేమీ వద్దు. నాకు ఫుడ్ ఉంటే చాలు. మిగతావన్నీ సెకండ్” అని నవ్వుతూ చెప్పింది. ఆ మాటలు ఇప్పుడు నెటిజన్లకు బాగా కనెక్ట్ అయ్యాయి. చాలామంది..ఇదే నిజమైన లైఫ్ ఫిలాసఫీ..ఫుడ్ లవర్స్ క్వీన్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రిటీ అయినా సరే.. సింపుల్‌గా తన మనసులోని మాటను చెప్పడం వల్ల మీనాక్షిపై మరింత ప్రేమ పెరిగిందని చెప్పొచ్చు. సినిమాల విషయానికి వస్తే..మీనాక్షి కెరీర్ కూడా సాఫీగా సాగుతోంది. మొదట్లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ తర్వాత వచ్చిన అవకాశాలు ఆమెను లక్కీ హీరోయిన్‌గా మార్చాయి..!!

Big Mistake: Nagarjuna Preferred Coolie Over Dhurandhar

Big Mistake: Nagarjuna Preferred Coolie Over Dhurandhar

Rashmika to play a villain Role In Allu Arjun atlee film!