
అక్కినేని కుటుంబం నుంచి ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. అయితే తండేల్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నాగ చైతన్య ఈ హిట్ స్ట్రీక్ ని కొనసాగించాలి అని టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ వర్మ దండుతో సాలిడ్ థ్రిల్లర్ ని తన కెరీర్ 24వ సినిమాగా అనౌన్స్ చేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే.
తనపై మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ ఇంకా రోల్ రివీల్ చేసారు. ఆమె ఓ పరిశోధకరాలిగా ఇందులో కనిపిస్తుంది. క్లీన్ లుక్ లో దక్ష అనే పాత్రలో ఆమె పర్ఫెక్ గా సెట్ అయ్యింది అని చెప్పాలి. అయితే విరూపాక్ష తర్వాత మరో గ్రిప్పింగ్ థ్రిల్లర్ ని కార్తిక్ ప్లాన్ చేస్తున్నాడని ఈ సెటప్ అంతా చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..!!
					
					
