in

Meenakshi Chaudhary: no more mother roles

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన కెరీర్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పిల్లల తల్లిగా కనిపించే పాత్రలు చేయబోనని ఆమె తేల్చి చెప్పారు. ‘హిట్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని, ఆపై ‘గుంటూరు కారం’లో మహేశ్ బాబు సరసన మెరిసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా రాణిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనాక్షి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో కథ నచ్చడం వల్లే తల్లి పాత్రలో కనిపించాను. అయితే భవిష్యత్తులో అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా ‘నో’ చెబుతాను. నటిగా ఎలాంటి పాత్ర అయినా చేయాలి, కానీ కొన్ని పరిమితులు పెట్టుకోవడం అవసరం” అని ఆమె స్పష్టం చేశారు. సీనియర్ హీరోలతో కలిసి నటించడం తనకు ఇబ్బంది కాదని, దానిని ఒక కొత్త జానర్‌గా భావిస్తానని ఆమె పేర్కొన్నారు..!!

Samantha Launches Luxury Fashion Brand ‘TRULY SMA’!

Tamannaah Breaks Silence On ‘Weight Loss injections’!