in

meenakshi chaudhary hopes for sankranti sentiment again!

24 – 2025 ఈ రెండేళ్లు మీనాక్షి చౌదరికి చాలానే హెల్ప్ చేశాయని చెప్పాలి. 2024లో ఆమె ఇక్కడ మహేశ్ బాబు తోను .. కోలీవుడ్ లో విజయ్ తోను సినిమాలు చేసింది. అలాగే దుల్కర్ తో ‘లక్కీ భాస్కర్’ చేసింది. ఇలా ఒకే ఏడాదిలో ముగ్గురు స్టార్ హీరోలతో చేసిన సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మహేశ్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా 2024 సంక్రాంతి బరిలో నిలిచి భారీ వసూళ్లను సాధించింది. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి ఆమె ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయాన్ని అందుకుంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో గ్లామర్ పరంగా .. నటన పరంగా కూడా మీనాక్షి మరిన్ని మార్కులు కొట్టేసింది. సంక్రాంతి బ్యూటీగా యూత్ కి మరింత చేరువైంది. అలాంటి మీనాక్షి చౌదరి మళ్లీ ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో 2026 జనవరిలో ఆడియన్స్ ను పలకరించనుంది. గట్టిపోటీ మధ్య ఈ సినిమా విడుదలవుతోంది. సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కూడా ఆమెకి కలిసిరావడం ఖాయమనేది ఫ్యాన్స్ మాట. ఇక చైతూ జోడీగా ఆమె చేస్తున్న ‘వృషకర్మ’ లైన్లో ఉన్న సంగతి తెలిసిందే..!!

Bigg Boss Ariyana Glory about her ups and downs in life!