సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 14న ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి.. తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. విజయ్‌తో కలిసి నటించిన ది గోట్ సినిమా విడుదలయ్యాక తనను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డానని ఆమె చెప్పారు. దీంతో వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లానని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..గోట్ సినిమా తర్వాత లక్కీ భాస్కర్ ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకోవడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో తన నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయన్నారు. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని.. మంచి సినిమాలపై దృష్టి పెట్టాలని అర్థం చేసుకున్నానని ఆమె అన్నారు..!!