ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారంటూ హడావిడి మొదలైంది. ఐతే అది నిజమే అనుకుని మీడియా ఛానెల్స్, కొన్ని వెబ్ సైట్స్ ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కొందరు అయితే దీని మీద చర్చలు కూడా చేస్తున్నారు. తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరా మీనాక్షికే ఎందుకు అంటూ డిస్కషన్ పెడుతున్నారు.
ఐతే అసలు విషయం ఏంటంటే మీనాక్షి కి ఎలాంటి ఆఫర్ రాలేదు. జస్ట్ ఎవరో ఈ తప్పుడు ప్రచారం చేశారు. ఏపీకి సంబందించిన విషయాల్లో ప్రతిదీ మీడియా ప్రత్యేకమైన అటెన్షన్ ఉంటుంది. అందుకే ఆ వార్తల్లో ఏది నిజం ఏది ఫేక్ అన్నది నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది..!!