తమిళ స్టార్ హీరో విజయ్ ని మద్రాసు హై కోర్టు రీల్ హీరో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయ్ పై హై కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. విజయ్ కి పన్నులు కట్టడానికి మనసు రావడం లేదని, ట్యాక్స్ కట్టేందుకు వెనకడుగు వేస్తున్నాడని చెప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2012లో విజయ్ ఇంగ్లండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకున్నాడు. అయితే, ఈ కారుకి సంబంధించి పన్నుని మాత్రం ఇంకా చెల్లించలేదు.
అంతేకాకుండా, దిగుమతిపన్నుకి మినహాయింపును ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో 2012లో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు విజయ్. తాజాగా ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ రోజు ఆ కేసును కొట్టివేసింది. పన్ను చెల్లించాల్సిందేనని విజయ్ ని ఆదేశించింది. అంతేకాదు, పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించినందుకు అతనికి భారీ జరిమానా విధించింది. పన్నుతో పాటు లక్ష రూపాయిల జరిమానా కూడా కట్టాలని విజయ్ కి మద్రాస్ హై కోర్టు సూచించిది.