రవితేజ సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే కచ్చితంగా ఆయన మార్క్ ఆఫ్ కామెడీ ఉంటుందని ఆడియన్స్ అంతా భావిస్తుంటారు. కానీ గత కొద్ది కాలంగా అది కనిపించడం లేదు. ఆ రీజన్ తోనే ఇటీవల విడుదలైన ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీ కూడా అనుకునంత స్థాయిలో ఆకట్టుకులేకపోయింది. సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు కాబట్టి కలెక్షన్స్ కి కొదవలేదు. అది వేరే విషయం. కానీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రవితేజ నుంచి కోరుకునే ఎంటర్టైన్మెంట్ సినిమాలో లేదు.
అయితే తాజాగా ఈ విషయం తెలిసి రవితేజ అలర్ట్ అయ్యారట. దాంతో తన తదుపరి చిత్రంలో కామెడీ డోస్ కాస్త పెంచమని మూవీ టీం కి సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా తరువాత అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ తో కామెడీ అండ్ యాక్షన్ మూవీస్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రవితేజ ‘ఈగల్’ బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతోంది..!!