in

mass hero Vishwak Sen teams up with Anudeep KV for ‘Funky’!

హైఎనర్జీ పెర్ఫార్మన్స్ లో అదరగొట్టే హీరో విశ్వక్ సేన్, హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో అనుదీప్ దిట్ట. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అవుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడూ మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టే విశ్వక్ సేన్ ఇప్పుడు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారంట.

తొలిసారి విశ్వక్ సేన్ ఈ సినిమా ద్వారా కామెడీ జోనర్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి ఫంకీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర సరికొత్త పంధా లో ఉంటుందని, చక్కని హాస్యంతో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాని సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు..!!

test your knowledge about music directors!