తాజాగా అతను ట్విట్టర్లో తనే హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఒక స్పేస్ పెట్టాడు. ఇందులో ‘మన్మథుడు-2’ ప్రస్తావన వచ్చినపుడు.. ఆ చిత్రంలో ఎక్కడ తేడా జరిగిందో ఉదాహరణగా ఓ సన్నివేశం గురించి చెప్పాడు. సినిమా మొదలైన 20 నిమిషాలకు నాగ్ ఒక అమ్మాయితో ఘాటు రొమాన్స్ చేసే సన్నివేశం అది. ఆ సమయంలో రూం షేక్ అయిపోతున్నట్లుగా చూపిస్తారు. ఈ సన్నివేశం చూసి నాగ్ అభిమానులందరం తట్టుకోలేకపోయామని ఓ నెటిజన్ అంటే..
ఆ సీన్ తీసేటపుడు తాము నవ్వుకున్నామని, కానీ థియేటర్లో జనాల రెస్పాన్స్ చూస్తే తాము చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైందని రాహుల్ అన్నాడు. ఆ సన్నివేశం దగ్గరే ప్రేక్షకులు సినిమా పట్ల వ్యతిరేక బావానికి వచ్చేశారని, అలాంటి సీన్ తర్వాత తాము ‘శంకరాభరణం’ చూపించినా వాళ్ల అభిప్రాయం మారదని.. సినిమాలో ఆ సీన్ పెద్ద బ్లండర్ అయిందని రాహుల్ అంగీకరించాడు. ఒక నెటిజన్ ‘మన్మథుడు-2’ బ్యాడ్ మూవీ ఏమీ కాదని ఏదో అనబోతుంటే. రాహుల్ అందుకుని ఇలాంటి పాజిటివ్ కామెంట్లు చేయకండి, మళ్లీ నాగ్ ఫ్యాన్స్ తనను తగులుకుంటారని చెప్పడం విశేషం.