ఇటీవల తన సినిమాపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడారు అలాగే ఆస్కార్ అవార్డు గురించి తెలిపారు. ఇక ప్రభాస్ ఎనర్జీ గురించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల గురించి ఈయన పొలిటికల్ కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్రదుమారం రేపుతున్నాయి. ఇటీవల మరో ఇంటర్వ్యూలో భాగంగా మంచి విష్ణు మాట్లాడుతూ తనుకు 280 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలిపారు.
తెలంగాణలో తనకు వంద మంది ఎమ్మెల్యేలు చాలా క్లోజ్ అలాగే ఏపీలో 160 మంది ఎమ్మెల్యేలు చాలా క్లోజ్ అని తెలిపారు. ఇక తమిళనాడులో కూడా మరో 20 మంది ఎమ్మెల్యేలు నాకు చాలా బాగా తెలుసు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే మంచు విష్ణు ఇలా తనకు 280 మంది ఎమ్మెల్యేలు తెలుసు అంటూ చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు విష్ణు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు..!!