in

Manchu Lakshmi leaves hyderabad and shift to Mumbai!

బాలీవుడ్ మూవీలు, వెబ్ సిరీస్‌లలో తనను తాను నిరూపించుకునేందుకు నటి మంచు లక్ష్మి రెడీ అయ్యారు. ఇందుకోసం ఆమె బాలీవుడ్‌కు షిఫ్టయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ‘‘కొత్త నగరం, కొత్త శకం. ఈ జీవితం పట్ల ఆనందంగా ఉన్నా. ఎల్లవేళలా నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అని ఎక్స్ చేశారు..

తాను ముంబైకి ఎందుకు మారాల్సి వచ్చిందన్న విషయం చెబుతూ..వృత్తిపరమైన పనుల నిమిత్తమే తాను ముంబైకి మకాం మార్చినట్టు తెలిపారు. దక్షిణాదిలో తాను ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినట్టు తెలిపారు. అక్కడ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇక్కడ విస్తృతమైన అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతోనే ముంబైకి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. లక్ష్మి తెలుగులో ప్రస్తుతం ‘అగ్ని నక్షత్రం’ సినిమాలో నటిస్తున్నారు..!!

keerthy suresh dating bollywood actor?

‘Stop making adult films’, Ekta Kapoor’s bold reply!