తినే ప్రతి మెతుకు మీద తినబోయే వాడి పేరు రాసి ఉంటుంది” అనేది ఒక నానుడి, అల్లాగే, “ప్రతి పాత్ర మీద నటించే వాడి పేరు వ్రాయబడి ఉంటుంది” అనేది సినీ జానాల నమ్మకం. ఈ నమ్మకానికి చాల ఉదాహరణలే ఉంటాయి, ఒకరు నటించ వలసిన పాత్ర ఇంకొకరు చేయటం, అనుకోకుండా చేసిన పాత్రలు కొన్ని, సూపర్ హిట్ కావటం వంటివి, సినీ పరిశ్రమలో చాల సహజం. ఆ కోవ కు చెందిన, మనం మిస్ అయినా, ఒక గొప్ప కాంబినేషన్ ఒకటుంది. రామ్ గోపాల్ వర్మ తీసిన రంగేళి సినిమా మన అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అందులో అమీర్ ఖాన్, ఊర్మిళ, జాకీ షరాఫ్ నటించారు. సినిమా తెలుగు, హిందీ, రెండు భాషలలో సూపర్ హిట్ అయింది అదంతా ఒక ఎత్హు అయితే, అసలు ఈ సినిమా కి ముందు అనుకున్న కాస్టింగ్ గురించి తెలిస్తే తెలుగు ప్రేక్షకులు ఒక్క గొప్ప కాంబినేషన్ మిస్ అయ్యారు అనే ఫీలింగ్ కలుగుతుంది, ఆ కాంబినేషన్ ఎవరో తెలిస్తే మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు…
ఈ సినిమా స్టోరీ ఫైనల్ అవగానే రాంగోపాల్ వర్మ, ప్రొడ్యూసర్ అశ్వని దత్ అనుకున్న హీరోయిన్ శ్రీదేవి గారిని, హీరో క్యారెక్టర్ కి నాగార్జున, రెండవ క్యారెక్టర్ కి గెస్ట్ గ రజనీకాంత్. ఇప్పుడేమంటారు? సెన్సేషనల్ కాంబినేషన్ అయి ఉండేదా కాదా?, కానీ బాడ్ లక్ ఏమిటంటే, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ” రంగేళి”, “గోవిందా గోవిందా” రెండు స్టోరీస్ శ్రీ దేవి గారికి చెప్పటం, ఆమెకు గోవిందా గోవిందా స్టోరీ నచ్చటం, ఆవిడ దానికి ఒకే చెప్పటం తో, రంగేళి ప్రపోసల్ అటక ఎక్కేసింది, గోవిందా గోవిందా సినిమా సెట్స్ మీద కు వెళ్ళింది. ఆ తరువాత రంగేళి సినిమా చేయాలనుకున్నప్పుడు హిందీ ప్రొడ్యూసర్స్ ఒకే చెప్పటం తో హిందీ, తెలుగు రెండు వెర్షన్స్ లో సినిమా చేయవలసి రావటం తో ఆటోమేటిక్ గ కాంబినేషన్ మారిపోయింది, దెబ్బతో ఒక సెన్సషనల్ కాంబినేషన్ మిస్ అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. అంతేనండి బాబు ఏదయినా రాసి పెట్టి ఉండాలి..!!