అప్పట్లోనే 35 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అప్పటివరకు గ్లామర్ రోజు చేసే అనుష్క అరుంధతి సినిమాతో తన విశ్వరూపాన్ని అందరికీ ప్రదర్శించింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ముద్ర పడింది. అయితే ఇది ఇలా ఉండగా మొదట అరుంధతి సినిమా అనుష్క అనుకోలేదంట, ఆ కథను మలయాల నటి మమతా మోహన్ దాస్కు చెప్పారట ఆమె కూడా సరే అని సైన్ కూడా చేశారట..ఇంతలోనే మమతా మోహన్ దాస్ మేనేజర్ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదని చెప్పడంతో..
తెలుగు చిత్ర పరిశ్రమపై అంత పెద్దగా అవగాహన లేని మమత మోహన్ దాస్ మేనేజర్ మాటలు గుడ్డిగా నమ్మి అరుంధతి సినిమా చేయలేదు. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి దాదాపు 3 నెలలు ఆమెను సినిమా చేయమని మమత ను అడిగాడంట. కానీ మమత కుదరదు అని చెప్పింది అంట. దాంతో చేసేది లేక గ్లామర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అనుష్కను ఫైనల్ చేశారంట, కట్ చేస్తే సినిమా బంపర్ హిట్టు. ఆ సినిమా విజయం తర్వాత మమత అరుంధతి మిస్ చేసుకున్న అని చాలా బాధ పడిందంట కానీ ఏం లాభం..!!