మాస్క్ వేయకపోతే నగ్నంగా ఉన్నట్టు ఫీలవుతున్నానని సంచలన కామెంట్ చేసింది మాళవిక మోహనన్. ‘మేము షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్స్లో కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ని అనుసరిస్తున్నాం. అందరు మాస్క్ వేసుకొనే ఉంటారు. కానీ నటులు మాత్రం మాస్క్‌లు తీసేయాల్సి ఉంటుంది. నేను రెగ్యులర్‌గా మాస్క్ వేసుకోవడం అలవాటు చేసుకున్నాను. కానీ సెట్లో మాస్క్ తీయమంటే మాత్రం నగ్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతగా మాస్క్ మన వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం అయింది.
అందుకే దాన్ని తెసివేసేటప్పుడు వింతగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది ఈ హాట్ భామ. ఇటీవల దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటిచింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు త్వరలో తెలుగులో నటించాలని చూస్తుంది. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన హీరో అనే సినిమాతో తెలుగులో పరిచయం అవ్వాలనుకుంది ఈ చిన్నది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పూర్తికాలేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్ల వస్తున్నాయి. కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతుందని చెప్పుకోచ్చింది. త్వరలోనే తెలుగులో నటిస్తా అంటుంది అందాల మాళవిక.