
సినిమాలో అవకాశం కోసం ఆమెను ఎంతో మంది ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించారని ఆమె స్పష్టం చేసింది. కానీ ఆమె ఈ పార్టీలకు వెళ్లకపోవడంతో దాదాపుగా 20 నుండి 30 సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నటి మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి మల్లికా షెరావత్. ‘మర్డర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మల్లికా షెరావత్.. తన బోల్డ్ సన్నివేశాలతో ప్రజలను ఆకట్టుకుంది. ఆమెకు సినిమాలో అవకాశం ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు క్యూ కట్టారు..
