సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్వీ ఒక మలయాళీ యువతి పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్, డ్రెస్సింగ్ స్టైల్‌కు మొదట మంచి స్పందన లభించినా, ఆమె మాట్లాడిన యాసపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, మలయాళ గాయని పవిత్ర మీనన్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు..
మలయాళీ పాత్రకు స్థానిక నటిని కాకుండా జాన్వీ కపూర్‌ను ఎందుకు ఎంపిక చేశారని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, జాన్వీ మాట్లాడిన మలయాళ యాసను విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో వివాదం పెద్దదైంది. ఈ పరిణామంతో జాన్వీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర మీనన్‌కు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతూ, ఆమె పోస్ట్ చేసిన వీడియోను రిపోర్ట్ చేశారు..!!