ధనుష్ సరసన నటించిన సార్ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, సంయుక్తకు తెలుగులో అవకాశాలు ఎక్కువయ్యాయి. లేటెస్ట్‌గా సాయిధరమ్ తేజ్‌తో నటించిన విరూపాక్ష చిత్రం కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని పిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ.. “ఒక సినిమా విజయం సాధించినా, విఫలమైనా దాని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిదీ బాధ్యత ఉంటుంది. అదృష్టం వల్లే విజయం వరిస్తుంది. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుని, మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తూ హీరోయిన్లు చాలా కష్టపడుతున్నారు. గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అనేవి కాలం చెల్లిన భావనలని సంయుక్త పేర్కొంది. అదృష్టాన్ని బట్టి నటిని ఎంపిక చేయకూడదని ఆమె అభిప్రాయపడింది. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా నటీనటుల ఎంపిక జరగాలని సంయుక్త సూచించింది. ఆమె మాటలకు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వెల్లువెత్తుతోంది..!!