in

Malayalam actress Madonna Sebastian on board for prabhas spirit!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని బ్రూటల్ అవతారంలో కనిపించనున్నారని తెలుస్తోంది..

ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణే స్థానంలో త్రుప్తి దిమ్రి ఫీమేల్ లీడ్‌గా నటించనుంది. అయితే, తాజాగా మలయాళ సుందరి మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కానీ, ఈ సినిమాలో ఆమె సెకండ్ లీడ్‌గా వస్తుందా లేక నెగటివ్ షేడ్స్‌లో నటిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది..!!

siddhu jonnalagadda took loans to return losses for jack!