మాళవిక మోహనన్ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో తన అనుభవాలను ఆమె పంచుకున్నారు. “నేను ప్రభాస్ సార్‌ను కలవడానికి ముందు ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉంటారని అనుకున్నా. కానీ, అనుకున్నంత సైలెంట్ కాదు అని ఆ తర్వాత తెలుసుకున్నా. ఆయనను స్వయంగా కలిసినప్పుడు మంచి మాటకారి, సూపర్ ఫన్, ఫన్నీ అని అర్థమైంది..
ఆయనతో సమయం గడపడానికి చాలా చక్కని వ్యక్తులలో ఒకరని తెలుసుకున్నా. డార్లింగ్ చుట్టూ ఎప్పుడూ బోరింగ్ క్షణమే ఉండదు” అని మాళవిక చెప్పుకొచ్చారు. ఇక, గతంలో కూడా ప్రభాస్‌ను ఆమె ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. ప్రభాస్ తన సహనటులను సెట్‌లో ఆహారంతో ఆకట్టుకుంటారని, ఒక గ్రామానికి సరిపడా రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తారని మాళవిక అన్నారు. ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏఈడీ’ సినిమా విజయం తర్వాత కూడా ప్రభాస్ చాలా సింపుల్‌గా, డౌన్ టు ఎర్త్ గా ఉన్నారని ఆమె కొనియాడారు..!!