ఇంటిమేట్ సీన్స్‌లో యాక్ట్ చేయడం అంత సులభం కాదన్నారు. ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు ఏ సినిమా సెట్‌లోనైనా ఇంటిమేట్ కో-ఆర్డినేటర్‌ను నియమిస్తున్నారు. నటీనటులు ఇబ్బందిపడకుండా ఆయా సన్నివేశాల్లో ఎలా యాక్ట్ చేయాలో వారు చెబుతుంటారు. అది చాలా మంచి నిర్ణయం. అయితే, మా సెట్‌లో అలాంటి కో-ఆర్డినేటర్స్ ఎవరూ లేరు. ‘సాథియా’ పాట గురించి చెప్పినప్పుడు సిద్దాంత్, నేను మొదట కంగారుపడ్డాం. ‘దీనిని మనం చేయగలమా’ అని సందేహం వ్యక్తంచేశాం..
సముద్ర తీరం, అందులోనూ చలి తీవ్రత తట్టుకోలేక..ఏదో ఒకరకంగా దీనిని పూర్తి చేసేయడం మంచిదని భావించి..దర్శకుడు చెప్పినవిధంగా చేసేశాం. ఇంటిమేట్, లేదా ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేయడం అంత సులభం కాదు. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి. సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలని మాళవిక తెలిపారు. యాక్షన్ ఫిల్మ్‌గా ‘యుధ్రా’ సిద్ధమైంది. శ్రీధర్ రాఘవన్ కథ రాయగా.. రవి ఉద్యావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..!!