సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’ జూలై 18న విడుదలవుతోంది. ఈ చిత్రంతో మలయాళ ‘జో’ ఫేమ్ మాళవిక మనోజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. దర్శకుడు రామ్ గోధల, నిర్మాత హరీష్ నల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ వినగానే బాగా నచ్చిందని, గతంలో చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్‌గా అనిపించిందంటోంది. సినిమాలో సత్యభామ అనే పాత్ర చేసింది..
ఈ పాత్ర చాలా హైపర్‌గా, మోడ్రన్ గర్ల్‌గా ఉంటుంది. తెలుగు రాకపోయినా భావాన్ని అర్థం చేసుకుని నటించానని, షూటింగ్ సమయంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశానని చెప్పింది. సినిమా కోసం స్విమ్మింగ్ తెలియకపోయినా ఓ సన్నివేశం కోసం భయపడుతూ స్విమ్మింగ్ చేసిన అనుభవం గురించి కూడా షేర్ చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో టెక్నిషియన్స్, ఆర్టిస్ట్‌లు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారని, లాంగ్వేజ్ తప్ప ఇంకెక్కడా ఇబ్బంది అనిపించలేదని చెబుతోంది..!!