ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ కపూర్ రిలేషన్షిప్ గురించి స్పందించారు. ఈ మేరకు రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ..నేను సింగిల్ గానే ఉన్నాను. రిలేషన్ లో లేను అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అర్జున్ కపూర్ మాజీ స్నేహితురాలు బాలీవుడ్ నటి మలైకా అరోరా స్పందించారు. ఈ మేరకు మలైకా ఈ విషయం గురించి స్పందిస్తూ..
నేనొక ప్రైవేట్ పర్సన్ ని. నాకు సంబంధించిన ఏ విషయాన్నీ త్వరగా బయటపెట్టను. నా జీవితంలో కొన్ని అంశాల గురించి ఎక్కువగా వివరించకూడదు అనుకుంటాను. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు పబ్లిక్ ప్లాట్‌ఫామ్ ను ఎప్పుడూ ఎంచుకోను. ఇక రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అర్జున్ ఏది చెప్పినా అది తన వ్యక్తిగత అభిప్రాయం. దానిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు అని మలైకా తెలిపారు. ఈ సందర్భంగా మలైకా అరోరా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!