మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరమయ్యింది. ఇటీవల ఆమె జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ ఆసక్తిగా కామెంట్స్ చేసింది. ఈ సందర్బంగా హీరోయిన్ మహేశ్వరీ మాట్లాడుతూ..
నాకు తమిళ నటుడు అజిత్ అంటే చాలా ఇష్టం ఆయనతో కలిసి నటించాను. అప్పుడే అజిత్ పై మనసు పడ్డాను. ఆయన నా క్రష్..అజిత్ కు ఆ విషయం చెప్పే లోగా సినిమా షూటింగ్ చివరి రోజు. నా దగ్గరకు వచ్చి. నీ వర్క్ నాకు బాగా నచ్చింది. నీకు ఫ్యూచర్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్న నన్ను అడుగు. నువ్వు నాకు చెల్లిలాంటిదాని అని అన్నారు. దాంతో నేను షాక్ అయ్యాను అంటూ సరదాగా తెలిపారు మహేశ్వరి..!!