
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంక భూమిక కలిసి ముఖ్య పాత్రలో నటించిన ‘ఒక్కడు’ సినిమా ఎంతటి గణ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ఈ సినిమా హీరో మహేష్, హీరోయిన్ భూమిక ఇంక డైరెక్టర్ గుణశేఖర్ ఈ ముగ్గురికి మంచి టైం లొ హిట్ ఇచ్చి కెరీర్ ని బాగా నిలబెట్టింది. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం చాల తక్కువ మందికి తెలిసి ఉంటుంది,అది ఏంటి అంటే.. ఈ సినిమా స్టోరీ అనుగుణంగా ముందుగా ‘అతడే ఆమె సైన్యం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట..కానీ ఆ టైటిల్ వేరే ప్రొడ్యూసర్ ఒకరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోవడంతో తప్పని పరిస్థితిలో ‘అతడే ఆమె సైన్యం’ ను ఒక్కడుగు మార్చడం జరిగింది.

