మహేష్ బాబు నటించిన మురారి చిత్రం కథ ఎలా పుట్టిందో తెలుసా ? కృష్ణ వంశి గారు , నందిగం రామలింగేశ్వర రావు గారి తో, మహేష్ బాబు హీరో గ ఒక సినిమా కమిట్ అయ్యారు.కథ రెడీ చేసుకోవటం కోసం గోదావరి తీరానికి వచ్చిన కృష్ణ వంశి గారు, స్నేహితులతో కలసి లాంచీ మీద ఆలా షికారుకు వెళ్లారు, యాదృచ్చికంగా ఇందిరాగాంధీ గారి కుటుంబం లో జరిగిన వరుస హఠాత్ మరణాల గురించి చర్చ వచ్చింది స్నేహితుల మధ్య ఎందుకు ఆలా అన్న కృష్ణ వంశి ప్రశ్న కు,స్నేహితుడు పున్నేశ్వర రావు, అదొక శాపం అన్నారు, ఇంతలో ఇంకో స్నేహితుడు తమ ఊరిలో జరిగిన ఒక యదార్ధ ఘటన చెప్పారు, ఆ చర్చ కృష్ణ వంశి లో ఒక కొత్త కధకు బీజం వేసింది,ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు, మెల్లగా మహేష్ బాబు కోసం ఒక మంచి కథ తయారు అవటం మొదలైంది, అయన మనసులో.
mahesh babu murari chitram katha ila puttindhi!
ఇంతలో రామలింగేశ్వర రావు గారి ఫోన్, మీ పని మీదే ఉన్నాను సర్ అని చెప్పి, మురారి కథ మొత్తం తన మనసులోనే రెడీ చేసుకున్నారు, కృష్ణ వంశి గారు బౌండ్ స్క్రిప్ట్ తో సెట్స మీదకు వెళ్లే అలవాటు లేదు, నిర్మాతకు, మహేష్ బాబు కు తాను అనుకున్న తర, తరాలుగా ఒక కుటుంబాన్ని వెండాడుతున్న ఒక శాపం, దానికి ప్యారెలెల్ గ లవ్ ట్రాక్ కలిపి కథ చెప్పారు, కృష్ణ వంశి మీద ఉన్న నమ్మకం తో ఇద్దరు ఓ.కే. చెప్పేసారు. సినిమా కు పేరు” కృష్ణా ముకుంద మురారి ” అనుకున్నారు కానీ చాల పెద్దగా ఉంది అని నిర్మాత ” మురారి ” అన్నారు అదే ఖరారు అయ్యింది, తెలుగు ప్రేక్షకులకు ఒక దృశ్య కావ్యం చూసే అవకాశం కలిగింది.