in

Mahesh Babu Masters Martial Arts in China: Exciting Updates!

రాజమౌళి సినిమా కోసం ఓ రేంజ్ లో కష్టపడుతున్న మహేష్ బాబు
రాజ‌మౌళి సూచనలతో  మొదట జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్నాడు.  జపాన్ లో ట్రైనింగ్ ముగిసిన తరవాత ఆఫ్రికాలో కూడా కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఆఫ్రికాలో ‘మ‌సాయి-పిగ్మీస్’ తెగ‌ల మ‌ధ్య కొన్నిరోజుల పాటు ఉండి   బేసిక్స్ నేర్చుకున్నాడు. 20 రోజుల పాటు ఆప్రికన్ తెగ‌ల మ‌ధ్య  ఉండి ఆ తెగల జీవన విధానం నడత నడవడిక అన్నిటిని మ‌హేష్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సరిపోక ఇప్పుడు కొత్తగా చైనా కూడా వెళ్తున్నాడట మహేష్.

మార్షల్ ఆర్ట్స్ స్పెషల్ ట్రైనింగ్ కొరకు చైనా కు మహేష్ బాబు
కారణం SSMB29 కి మార్ష‌ల్ ఆర్స్ట్ కూడా అవసరమని, ఇందుకోసం బేసిక్ ట్రైనింగ్ తీసుకోమని మహేష్ కి సూచించాడట జక్కన్న. ఈ క్రమంలో ఈ నెలలోనే చైనాకి బయలు దేరుతున్నాడు మహేష్. చైనాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ దగ్గర శిక్షణ తీసుకుంటాడని, తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. మ‌హేష్ తో పాటు జక్కన్న కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కి అటెండ్ అవుతున్నాడట. రాజమౌళి సమక్షంలోనే మహేష్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోనున్నాడు. ఒక్క సినిమాకోసం మహేష్ ఎన్ని నేర్చుకుంటున్నాడో అని ఫాన్స్ అభినందిస్తున్నారు..!!

catherine tresa becomes lucky girl for icon star!

samanth: It Is ‘Fun’ To Recover From Chikungunya