
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సూ[/qodef_dropcaps] పర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుండగా. రెండు నెలలు క్రితం చిత్ర యూనిట్ జమ్మూ కాశ్మీర్ లొ సినిమాకి సంబంధించి తొలి షెడ్యూల్ పూర్తిచేసుకొని హైదరాబాద్ కి తీరుగు ప్రయాణమైనా సంగతి తెలిసిందే. అయితే జమ్మూ కాశ్మీర్ లొ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే, అందుకే అక్కడ సినిమా షూటింగ్ జరపడం ఈమధ్య చాలా కష్టం గ మారిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితే మహేష్ సినిమా కి ఎదురవ్వగా అక్కడ షూటింగ్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కోరారు. మహేష్ బాబు కోరిక మేరకు రక్షణశాఖ మంత్రి మహేష్ బాబుకు సహాయం చేశారట. అంతే కాకుండా షూటింగ్ కు వెళ్లి వచ్చే సమయంలో మహేష్ బాబు బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుకునే సౌకర్యాన్ని కూడా ఇచ్చినట్లు సమాచారం.