in

mahes babu Rajamouli’s Varanasi earns Rs 650 crore already!

రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ott బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ హక్కులకు సంబంధించి వినిపిస్తున్న ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 650 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఒక్క చిత్రానికి ఈ స్థాయి ధర పలకడం ఇదే తొలిసారి..

ఈ భారీ ఆఫర్‌తో పాటు మేకర్స్ ఒక కీలక నిబంధనను కూడా నెట్‌ఫ్లిక్స్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాలు విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ రాజమౌళి మార్క్ సినిమాలకు థియేటర్లలో ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కనీసం 8 నుండి 12 వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ‘RRR’ నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, మహేశ్ బాబు సినిమాపై కూడా అదే స్థాయి నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధమైంది..!!

Actress Jaya Vahini Passes Away After Cancer Battle!