నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొన్న బ్యూటీ మాధవీలత. కొంతకాలంగా సినిమాలకు దూరమైన మాధవీలత.ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బీజేపీలో చేరిన ఈ బ్యూటీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైంది.
ఫైర్ బ్రాండ్‌గా నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలిచే మాధవీలత మరోసారి బాంబు పేల్చింది. టీడీపీ నుండి బీజేపీలో చేరిన సాధినేని యామినిని టార్గెట్ చేస్తూ మండిపడింది. వారణాశి కాశీ దేవస్థాన బోర్డ్‌లో దక్షిణాది తరుపున అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు యామిని. అంతే యామినిని టార్గెట్ చేస్తూ ఇండియాలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదని, గొప్ప వాళ్లతో పరిచయాలు, రికమండేషన్స్ ఉంటే చాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రాజకీయాలే కాదు ఎక్కడైనా రికమండేషన్స్ అనేవి ఉంటాయని, తనను రికమండ్ చేసే గొప్పవాళ్లు ఎవ్వరూ లేరని, ఉందల్లా కేవలం అభిమానులే అంటూ పేర్కొంది. టీడీపీ నుండి బీజేపీలో చేరిన వెంటనే సాధినేని యామినికి అధికార ప్రతినిధి పదవి దక్కడంతో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది.