స్క్రీన్ మీద గోపీచంద్ ఖాకీ చొక్కా తొడిగి పద్నాలుగు సంవత్సరాలయ్యింది. చివరిసారి 2010 పూరి గోలీమార్ లో గంగారాంగా చూపించిన విశ్వరూపం అందరికీ గుర్తే. అంతకు ముందు శౌర్యం, ఆంధ్రుడులో కూడా ఈ తరహా పాత్రలు చేశాడు. అయితే ఇవన్నీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా తీవ్రంగా నిరాశపరిచినవి కావు. అందుకే భీమా మీద ఆ కోణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక దర్శకుడు హర్ష విషయానికి వస్తే ఇతను మామూలోడు కాదు. బాలయ్య శివరాజ్ కుమార్ కాంబో ప్రాజెక్టు ఇతనే చేయబోతున్నాడు. మూడు భాగాల సిరీస్ లో రజనీకాంత్ నటించే అవకాశం కూడా ఉంది..
ఇతని ట్రాక్ రికార్డు చూస్తే డార్క్ టోన్ లో స్టైలిష్ కం ఫాంటసీ ఎంటర్ టైనర్లు బాగా తీస్తాడు. భజరంగి రెండు భాగాలు దానికి మంచి ఉదాహరణ. వేద ఇక్కడ ఆడలేదు కానీ శాండల్ వుడ్ లో రెవిన్యూ పరంగా బాగా పే చేసింది. రారండోయ్ వేడుక చూద్దాం. విశాల్ పూజలను కన్నడ లో రీమేక్ చేసుకుని హిట్లు కొట్టాడు. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీ పుత్ర అనే సక్సెస్ ఫుల్ మూవీ చేశాడు. సో భీమా మీద నమ్మకం పెట్టుకోవచ్చనే వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న గోపీచంద్ ఈసారి పోలీస్ దుస్తుల్లో ఏం రచ్చ చేయబోతున్నాడో..!!