
బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో తీసిన లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసింది కియారా అద్వాని. కరణ్ జోహార్ లాంటి పాపులర్ డైరెక్టర్స్ తీసిన ఈ వెబ్ సిరీస్ లో కూడా రాధికా ఆప్టే, మనీషా కోయిరాల, నేహా ధూపియా, భూమి పడ్నేకర్, సంజయ్ కపూర్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా వాళ్ళందరికంటే కియారా విపరీతమీన పాపులారిటిని సాధించింది. దీని ద్వారానే తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో కియారా కి అవకాశం వచ్చింది. ఇదంతా లస్ట్ స్టోరీస్ లో చేసిన క్యారెక్టర్ తో వచ్చిన పాపులారిటీనే. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది. అక్షయ్ కుమార్ తో రెండవ సినిమా చేస్తుంది. అంతేకాదు బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కియారానే. అందుకే కియారా నేను స్టార్ హీరోయిన్ అవడానికి కారణం లస్ట్ స్టోరీస్ అని గర్వంగా చెబుతుంది.

