ఈసినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలను, ఎమోషన్లను జోడించి వెంకీ అట్లూరి అద్భుతంగా రూపొందించాడు. కాగా ఈ మూవీ తెలుగుతో పాటు.. తమిళ్ మలయాళం భాషలోనూ రిలీజై మొదటి రోజు రూ.18.07 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. కాగా లక్కీ భాస్కర్‌కు దుల్కర్ సల్మాన్ ఫస్ట్ ఛాయిస్ కాదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట ఈ ఛాన్స్ ను ఒక టాలీవుడ్ హీరో రిజెక్ట్ చేశాడట. అతను మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని అని తెలుస్తుంది.
మొదట వెంకీ అట్లూరి నానికి కథను వినిపించగా..స్టోరీ బాగుందని అయితే అప్పటికే వరస సినిమాలో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత కథను దుల్కర్ సల్మాన్‌కు చెప్పడం..ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించడం.. మిడిల్ క్లాస్ తండ్రిగా దుల్కర్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం జరిగాయి. ప్రస్తుతం లక్కీ భాస్కర్‌కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందడం విశేషం. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. నాచురల్ స్టార్ నాని తన ఖాతాలో పడాల్సిన ఓ హిట్ సినిమాను మిస్ అయ్యాడు అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు..!!