in

‘Love Story’ and ‘most eligible bachelor’ on Aha!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లుంది. కొంచెం పెద్ద స్థాయిలోనే పెట్టుబడులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. వరుసబెట్టి పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్‌లు తీస్తూనే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి తీసుకొస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘లవ్ స్టోరి’ గురించే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఏప్రిల్ 16నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. మళ్లీ థియేటర్లు తెరుచుకుని పూర్తి స్థాయిలో నడిచే సమయానికి ‘లవ్ స్టోరి’ వచ్చేస్తుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రాన్ని ఆహాలోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగానే ప్రకటించింది. దీంతో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో తెరకెక్కుతున్న అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. నాగశౌర్య చిత్రం ‘లక్ష్య’ డిజిటల్ హక్కులను ఆహానే సొంతం చేసుకుంది. ఈ చిత్రాల వరుస చూస్తుంటే ఆహా మరో స్థాయికి వెళ్తున్నట్లే కనిపిస్తోంది.

AATMAHATYA CHESUKOVALI ANUKUNNA MANOJ BAJPAI!

Chinmayi trashes pregnancy rumour!