సమంతను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలా సినిమాలకు సమంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే సమంత సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన ఖచ్చితంగా అది నాగచైతన్యను ఉద్దేశించే చేస్తుంటారు అంటూ అభిమానులు భావిస్తుంటారు.
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు. మనిషిగా మీరు ఒక స్థిరమైన జీవి కాదు. ఏదీ స్థిరంగా ఉండదు – మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు అంటూ సమంత పోస్ట్ చేయడంతో కచ్చితంగా సమంత ఈ పోస్ట్ నాగచైతన్ నేను ఉద్దేశించి చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఈమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసిన కొందరు పరోక్షంగా చైతన్యమైన ఉద్దేశించి చేసింది అంటూ కామెంట్లో చేస్తుంటారు..!!