in

locust storm related to Surya film!

మిడుతల‌ దండయాత్రను దర్శకుడు కె.వి.ఆనంద్ ఎలా ఊహించారు? అనే దానిపై ఇప్పటికే ఇంటర్నెట్ లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మడగాస్కర్ లో ఒక చిత్రానికి లొకేషన్లను స్కౌట్ చేస్తున్నప్పుడు కేవీ పై మిడుతలు దాడి చేశాయిట‌. ఆ సంగ‌తిని ఆయనే స్వ‌యంగా వెల్ల‌డించారు. “ మాట్రాన్ (సూర్య‌) ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం తొమ్మిది సంవత్సరాల క్రితం మడగాస్కర్ ను సందర్శించాను. నేను లొకేషన్ స్కౌటింగ్ చేస్తున్నాను. నేను నా బృందంతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు.. వేలాది మిడుతలు మా దగ్గరికి రావడాన్ని నేను చూశాను. మాకు కార్ డ్రైవ్ చేయడం కష్టమైంది. అది క్లియర్ కావడానికి కొన్ని గంటల పాటు మ‌ర్గం మ‌ధ్య‌లోనే ఆగిపోవలసి వచ్చింది. ఆ సమయంలో వాటి గురించి అక్కడ ఉన్న ఒక స్థానిక వాసిని అడిగాను. చాలా వివరాలను సేకరించాను. తరువాత ఈ ఆలోచనను నా కప్పాన్ చిత్రంలో చేర్చాను“ అని తెలిపారు.

“మిడుత దాడులపై సినిమా తీసినందుకు నన్ను మెచ్చుకుంటూ చాలా కాల్స్ మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ నేను బాధపడుతున్నాను. ఈ విష‌యంలో నేను నిజంగా సంతోషంగా ఉండలేను. మిడుతల‌ దండయాత్ర వ‌ల్ల దేశానికి భారీ విధ్వంసం త‌ప్ప‌దు. వాటిని త‌క్ష‌ణం ఆపాలి. అందుకు త‌గు చర్యలు తీసుకోవాలి“ అని అన్నారు. ప్ర‌స్తుతం వైర‌స్ పై ఊహించిన మురుగ‌దాస్ పైనా.. అలాగే మిడుత‌ల దాడిపై ముందే ఊహించిన కె.వి.ఆనంద్ పైనా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

jr ntr about naga babu!

raghavendra rao garini thiraskarinchina bollywood heroine!