చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్ మే22 నుంచి ప్రారంభమవుతోందని తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ గా నయనతార ఎంపికయ్యారనే వార్త వైరల్ అవుతోంది. మరో హీరోయిన్ గా కేథరిన్ థెరిస్సాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది..
చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్ కు కేథరిన్ నే తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. పాటలో లక్ష్మీరాయ్ నటించారు. వాల్తేరు వీరయ్యలో రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించారు. ఇప్పుడు చిరంజీవి-అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది..!!